జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఐలాపూర్‌లో హనుమాన్ జయంతి పూజలకు సిద్ధంగా ఉన్న ఆంజనేయస్వామి ప్రజలకు కరోనా సందేశాన్ని ఇస్తున్నారు. సాధారణంగా విగ్రహ ఆవిష్కరణ పూజలు అయ్యేంతవరకు కళ్లకు గంతలు కట్టేస్తారు. ఆ గంతలు కాస్త కిందికి దిగి ముఖానికి మాస్క్‌గా మారింది. మాస్కుతో కనిపిస్తున్న ఆంజనేయుడు భక్తులకు కరోనాపదేశం ఇస్తున్నట్టు దర్శనమిస్తోంది.
మాస్క్‌తో ఆంజనేయస్వామి కరోనోపదేశం - telangana varthalu
ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది. కానీ చాలా మంది కరోనా నిబంధనలను పాటించడం లేదు. ఇది గమనించిన సాక్షాత్తు ఆంజనేయ స్వామి స్వయంగా తానే మాస్క్ ధరించి ప్రజలకు కరోనోపదేశం ఇస్తున్నారు.
ఆంజనేయ స్వామి కరోనోపదేశం
కరోనా ముందు మనుషులే కాదు దేవుడు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని చెప్తున్నట్టు కనిపిస్తోంది. మాస్క్ తప్పనిసరి అని సాక్షాత్తు ఆంజనేయుడు ఇస్తున్న సందేశాన్ని చూసైనా ప్రజలు ఫాలో అవుతారేమో చూద్దాం.
ఇదీ చదవండి: 'అవసరమైతే కొవిడ్ బోగీలను వినియోగించుకోండి'
Last Updated : Apr 22, 2021, 1:28 PM IST