తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో ఇంటర్‌ విద్యార్థులకు మాస్కుల పంపిణీ - AWARENESS ON CORONA VIRUS TO STUDENTS

జగిత్యాలలో ఇంటర్​ విద్యార్థులకు అధికారులు మాస్కులు అందజేశారు. కరోనా వైరస్​ మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు.

MASK DISTRIBUTED TO INTER STUDENTS IN JAGITYAL
MASK DISTRIBUTED TO INTER STUDENTS IN JAGITYAL

By

Published : Mar 7, 2020, 1:30 PM IST

దుబాయి నుంచి వచ్చిన జగిత్యాల యువకుడికి కరోనా లక్షణాలు కనిపించటం వల్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటర్‌ పరీక్ష రాసే విద్యార్థులకు పలు పరీక్షా కేంద్రాల్లో కోరిన వారికి మాస్క్‌లు అందజేశారు.

పరీక్ష కేంద్రాల్లో మాస్క్‌లు అందజేసి.. కరోనా వైరస్​పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులందరికీ మాస్క్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నోడల్‌ అధికారి నారాయణ తెలిపారు. వైరస్​ నుంచి కాపాడేందుకు తమ వంతుగా పలు కార్యక్రమాలతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

జగిత్యాలలో ఇంటర్‌ విద్యార్థులకు మాస్కుల అందజేత

ఇవీ చూడండి:మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details