పెన్సిల్ మొనపై అమరవీరుల స్తూపం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన గాలిపల్లి చోలేశ్వర్ అద్భుతం సృష్టించాడు. పెన్సిల్‌పై అమర వీరుల స్తూపాన్ని చెక్కి తెలంగాణ కోసం బలిదానం చేసిన వారికి అంకితమిచ్చాడు. పెన్సిల్ మొన మీద గంట సమయంలో అమరవీరుల స్తూపాన్ని చెక్కినట్లు చోలేశ్వర్ తెలిపాడు.