జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండా ప్రయాణించాడు. అతణ్ని మాస్కు ఏదని కండక్టర్ అడగడం వల్ల వాగ్వాదానికి దిగాడు. కొంతసేపటి తర్వాత బస్సు దిగిన యువకుడు పక్కనే ఉన్న భవనంపై ఎక్కి బెదిరింపులకు పాల్పడ్డాడు.
మాస్కు ధరించమని అడిగినందుకు ఆత్మహత్యాయత్నం - man tried to commit suicide in jagtial
మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు ఓ యువకుడు భవనంపై నుంచి దూకుతానని బెదిరింపులకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు అతనికి సర్దిచెప్పి దింపేశారు.
జగిత్యాల జిల్లా వార్తలు, మాస్కు పెట్టుకోమన్నందుకు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కి ప్రాణాలు తీసుకుంటానని హల్చల్ చేశాడు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు యువకుణ్ని దింపేశారు.