తెలంగాణ

telangana

ETV Bharat / state

నాకు టీకా వద్దు బాబోయ్... వేసుకోనంటే వేసుకోను! - Telangana news

Vaccine Rejected: కరోనా వ్యాక్సిన్ వద్దంటూ ఓ వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చోటుచేసుకుంది. అందరికీ టీకా అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో టీకా వేయడానికి వెళ్లిన వారిని చూసిన ఆ వ్యక్తి హల్​చల్ చేశాడు.

Vaccine
టీకా

By

Published : Dec 6, 2021, 10:37 PM IST

Updated : Dec 6, 2021, 10:55 PM IST

నాకు టీకా వద్దు బాబోయ్... వేసుకోనంటే వేసుకోను!

Vaccine Rejected: కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఏకైక మార్గమని వైద్యాధికారులు చెబుతుంటే.. టీకా మత్తు మందు.. నేను వేసుకోను.. ఒత్తిడి చేస్తే గ్రామం వదిలిపెట్టి పోతానంటూ ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో చోటుచేసుకుంది. ఇంటింటికి తిరుగుతూ టీకాలు పంపిణీ చేస్తున్న సిబ్బందికి వింత పరిస్థితి ఎదురైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.... తాను టీకా వేసుకోనని తెగేసి చెప్పగా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు.

Vaccine Rejected: గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. ఉన్నతాధికారులు కూడా ఇంటింటికి తిరుగుతూ టీకాల కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. తాటిపల్లి గ్రామంలో 50 సంవత్సరాల.. రొండి ఎల్లయ్య ఇంటికి వెళ్లారు. తాను టీకా తీసుకోబోనని హంగామా చేశాడు. దీంతో స్థానిక సర్పంచ్ భర్త బింగి వేణు, వైద్య సిబ్బంది వ్యాక్సిన్ మంచిదని తప్పనిసరిగి వేసుకోవాలని నచ్చచెబుతూ బతిమలాడినప్పటికీ అతను టీకా తీసుకోలేదు. ఎంతకీ వినకపోవడం వల్ల వారు సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో ఏకంగా ఇంటికి గొళ్లం పెట్టి అదృష్యమయ్యాడు.

ఇదీ చూడండి:ఒకే పాఠశాలలో 69మందికి కరోనా.. లక్షణాలు లేకుండానే!

Last Updated : Dec 6, 2021, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details