జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓవ్యక్తి ఇంకో వ్యక్తిపై విచక్షణా రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన తిప్పర్తి కిషన్, లక్ష్మణ్ భూతగాదాల విషయంలో రోడ్డుపై తగాదా పడ్డారు. అనంతరం లక్ష్మణ్ తన ద్విచక్ర వాహనం నుంచి గొడ్డలి తీసి కిషన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. స్థానికులు ఈ ఘటన చూసి భయ భ్రాంతులకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కిషన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం - భూతగాదాలు
భూ తగాదాల విషయం ఇద్దరి మధ్య తగాదాకు కారణమైంది. జగిత్యాల జిల్లాలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
![భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3007424-thumbnail-3x2-axe.jpg)
గొడ్డలి దాడి
Last Updated : Apr 15, 2019, 2:44 PM IST