జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆవాస గ్రామం వెంకటరావుపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. ఘనంగా జాతర నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉండి స్వామివారికి పూజలు చేశారు.
మల్లన్న సన్నిధిలో ఘనంగా బోనాల జాతర - తెలంగాణ వార్తలు
జగిత్యాల జిల్లా వెంకటరావుపేటలో మల్లన్న స్వామికి ఘనంగా జాతర నిర్వహించారు. భారీ ఊరేగింపుతో డప్పు చప్పుళ్ల నడుమ స్వామివారికి బోనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.

మల్లన్న స్వామికి ఘనంగా బోనాల జాతర
డప్పు చప్పుళ్ల నడుమ వీధి వీధిన బోనాల ఊరేగింపు చేసి.. గ్రామ శివారులో ఉన్న మల్లన్న స్వామివారికి సమర్పించారు.పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఊరేగింపును ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాంగణమంతో భక్తులతో నిండిపోయింది. మల్లన్న నామ స్మరణతో గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొంది.
ఇదీ చూడండి: మార్పును ఆహ్వానిస్తున్న జనం... ఈ- బైక్లకు పెరుగుతోన్న ఆదరణ