మహాత్మా గాంధీ ఆశయాలను అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరూ నడవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఖాదీ గ్రామోద్యోగ సంస్థాన్‌లో మహాత్ముని జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గాంధీ అడుగు జాడల్లో నడవాలి: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు - గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరూ నడవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఖాదీ గ్రామోద్యోగ సంస్థాన్‌లో మహాత్ముని జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
గాంధీ అడుగు జాడల్లో నడవాలి: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
రాట్నంతో దారం వడికి ఖాదీ కార్మికుల్లో ఎమ్మెల్యే ఉత్సాహాన్ని నింపారు. ఏళ్ల తరబడి మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ వివిధ రకాల వస్త్రాలను తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మికులను కొనియాడారు.
ఇదీ చదవండి:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు కరోనా