జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఖాదీ గ్రామోద్యోగ సంస్థానంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కార్మికులు.. అఖండ సూత్ర యజ్ఞాన్ని ప్రారంభించారు. ప్రతిఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరం రాట్నం వడుకుతూ దానితో తయారైన దారాన్ని మహాత్ముని మెడలో మాలగా అలంకరిస్తారు.
మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా.. మెట్పల్లిలో అఖండ సూత్ర యజ్ఞం - korutla mla vidya sagar tribute to gandhi
మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ, గాంధీ.. ఆశయాలకనుగుణంగా ఆయన నీడలో ఆ కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిఏటా నిర్వహించే అఖండ సూత్ర యజ్ఞాన్ని నిర్వహించి జాతిపిత స్మృతులను గుర్తుచేసుకుంటున్నారు.
మెట్పల్లిలో అఖండ సూత్ర యజ్ఞం
ఈ యజ్ఞం ప్రతిఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఖాదీ మేనేజర్ మాధవ్ తెలిపారు. మహాత్ముని అడుగుజాడల్లో నడవడానికి ఈ కార్యక్రమం ఒక మంచిదారని అన్నారు. ఈ అఖండ సూత్ర యజ్ఞంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. కొద్దిసేపు రాట్నంతో దారం వడికి.. మహాత్మునికి నివాళులర్పించారు.
- ఇదీ చూడండిబాపూదే గురుపీఠం- ఆయనో వికాస పాఠం!