4,160 ఇళ్ల నిర్మాణం చేపట్టి... 100 ఇళ్లే పూర్తి చేశారు: రమణ - తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ
రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిందని తెలుగుదేశం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.
'4,160 ఇళ్ల నిర్మాణం చేపట్టి 100 ఇళ్లే పూర్తి చేశారు'
రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్న కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడైనా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారా అని తె.తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీలో 4,160 ఇళ్ల నిర్మాణం చేపట్టి 100 ఇళ్లే పూర్తి చేశారని ఆరోపించారు. శంకుస్థాపన చేసిన కేటీఆర్ నూకపల్లికి వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. వెంటనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : ప్రగతిభవన్లో పంచాయతీరాజ్ శాఖపై కేసీఆర్ సమీక్ష
TAGGED:
ttdp