విషాదం: పెద్దలను ఒప్పించలేక ప్రేమజంట బలవన్మరణం
15:39 July 07
విషాదం: ఇబ్రహీంపట్నంలో ప్రేమజంట బలవన్మరణం
ప్రేమే తమ జీవితం అనుకున్నారు. కలిసి కలకాలం బతుకుదామంటూ మాటిచ్చుకున్నారు. ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు. చివరికి ఆ ప్రేమలోనే ప్రాణాలు వదిలారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రణీత్... ఓ యువతి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ ఫలించేలోపే యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం నిశ్చయం చేశారు.
పెద్దలను ఎదిరించలేక... విడిపోయి ఉండలేక... ఇద్దరూ చావే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు. యువకుడు ఉరేసుకుని మృతి చెందగా.... యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.