తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి - 20 మేకలు మృతి

జగిత్యాల జిల్లా రామయ్యపల్లె వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మేకలతో బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బొలెరోలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి

By

Published : Jun 29, 2019, 1:07 PM IST

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రామయ్యపల్లె వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై మేకలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​తో పాటు బోలెరోలో వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ గులాబ్ జావేద్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోలేరో బోల్తా పడటం వల్ల 20 మేకలు చనిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details