కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్ పగడ్బందీగా కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయలు, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. జగిత్యాల టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న మార్కెట్ ఇరుకుగా ఉండటం వల్ల అదనపు మార్కెట్లను ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలో పగడ్బందీగా లాక్‌డౌన్ - జగిత్యాల జిల్లాలో పగడ్బందీగా లాక్‌డౌన్
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్ల రద్దీ మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. జగిత్యాల జిల్లాలో కొనుగోళ్లకు ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు అవకాశం కల్పించారు. అదనపు కలెక్టర్ రాజేశం, మున్సిపల్ ఛైర్ పర్సన్ బి. శ్రావణి పరిశీలించారు.
![జగిత్యాల జిల్లాలో పగడ్బందీగా లాక్‌డౌన్ Lockdown in Jagietal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6558432-724-6558432-1585287841025.jpg)
జగిత్యాల జిల్లాలో పగడ్బందీగా లాక్‌డౌన్
అదనపు కలెక్టర్ బి రాజేశం, మున్సిపల్ ఛైర్ పర్సన్ బి. శ్రావణి పరిశీలించారు. సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని సూచించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో అదనపు కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో పగడ్బందీగా లాక్‌డౌన్