జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో వచ్చే నెల 5 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఇటీవల కరోనా కేసులు అధిక సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో లాక్డౌన్ ప్రకటించుకున్నారు.
మరో మండలంలో స్వచ్ఛంద లాక్డౌన్ - తెలంగాణ వార్తలు
జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు గ్రామాల్లో పంచాయతీ సభ్యులు ఆంక్షలు విధించారు. వెల్గటూర్ మండల కేంద్రంలోనూ స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.
వెల్గటూర్‌లో లాక్డౌన్, వెల్గటూర్ మండలంలో కరోనా కేసులు
ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మెడికల్ షాపులు మినహా దాదాపు అన్ని దుకాణాలు మూసివేశారు.
ఇదీ చదవండి:ముక్కుపై మంగు మచ్చలు.. ఎలా పోతాయి?