జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చేవారిని పోలీసులు నిలువరిస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ సింధూశర్మ జగిత్యాల పట్టణంలో లాక్‌డౌన్ తీరును పరిశీలించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఒకే దగ్గర గుమిగూడి ఉండకుండా భౌతిక దూరం పాటించి... మాస్కు ధరించాలని సూచించారు. 10 గంటల తర్వాత రోడ్లపైకి ఎవరూ రాకూడని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జగిత్యాలలో పటిష్టంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ - telangana latest news
జగిత్యాలలో పటిష్టంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ సింధూశర్మ జగిత్యాల పట్టణంలో లాక్‌డౌన్ తీరును పరిశీలించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
![జగిత్యాలలో పటిష్టంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ Lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-tg-krn-23-21-sp-parishilana-avb-ts10035-2105digital-1621580780-1031.jpg)
Lockdown