తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో కఠినంగా లాక్​డౌన్ - తెలంగాణ వార్తలు

జగిత్యాల జిల్లాలో లాక్​డౌన్ అమలును మరింత కఠినతరం చేశారు. ఉదయం పది తర్వాత రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు. ఆదివారం నుంచి సరుకు రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు విధించారు.

lock down strictly imposed in jagtial, jagtial lock down
జగిత్యాలలో లాక్​డౌన్, జగిత్యాలలో కఠినంగా లాక్​డౌన్ అమలు

By

Published : May 24, 2021, 12:39 PM IST

జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే 158 వాహనాలు స్వాధీనం చేసుకొని.. 3500 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ సింధూ శర్మ ఆదేశాలతో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆదివారం రోజు నుంచి సరుకు రవాణ చేసే వాహనాలను నిలిపేశారు.

ఉదయం 10 నుంచి రాత్రి తొమ్మిది వరకు సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. సరుకు రవాణా, లోడింగ్‌ , అన్‌లోడింగ్‌ కార్యకలాపాలను రాత్రి 9 నుంచి మరసటి రోజు ఉదయం 8 గంటల లోపే పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ పరిస్థితిని కలెక్టర్‌ రవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా వేళ ఆపన్న హస్తం.. గౌరవంగా తుది మజిలీ!

ABOUT THE AUTHOR

...view details