జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ అమలును అధికారులు, పోలీసులు కఠినంగా నిర్వహిస్తున్నారు. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలను జిల్లా కలెక్టర్ రవి పర్యటించి లాక్ డౌన్ ను పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు అవగాహన కల్పించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
జిల్లాలో లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు
జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ అమలును కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పలు పట్టణాలను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లాలో లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు
కోరుట్ల పట్టణంలో లాక్ డౌన్ అమలుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తూ అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనానాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటి వరకు పట్టుకున్న వాహనాలతో పోలీస్ స్టేషన్ లు నిండిపోయాయి. మాస్కులు లేని వారు బయట తిరిగితే జరిమానా విధిస్తూ హెచ్చరిస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరిగిన వారికి హెచ్చరించి పంపిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న దాతలు