తెలంగాణ

telangana

ETV Bharat / state

లింగన్నను తీసుకెళ్లిన కశ్మీర్ పోలీసులు - గూగుల్​ పే కేసులో లింగన్నను జమ్ముకు తరలింపు

సైన్యం రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో బుధవారం రాత్రి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు మరోసారి మెట్‌పల్లికి వచ్చారు. నగదు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న(35)ను కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌తో జమ్మూకు తరలించారు.

linganna was moved to jammu by jammu kashmir police
లింగన్నను తీసుకెళ్లిన కశ్మీర్ పోలీసులు

By

Published : Mar 12, 2020, 1:31 PM IST

జమ్మూ-కశ్మీర్‌ ఆర్మీ క్యాంపులో కార్మికుడిగా పనిచేసే రాజేశ్‌ అనే యువకుడు సైన్యం సమాచారాన్ని అనిత అనే మహిళకు చేరవేస్తున్నాడన్న ఫిర్యాదుపై జనవరిలో కేసు నమోదైంది. రాజేశ్‌ ఖాతాకు వివిధ బ్యాంకుల నుంచి సొమ్ము వచ్చినట్లు విచారణలో తేలింది. జగిత్యాల యువకుడు లింగన్న ఖాతా నుంచి ఫిబ్రవరి 13న రూ.5 వేలు, 20న రూ.40 వేలు జమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన జమ్మూ పోలీసులు ఈ నెల 3న మెట్​పల్లి వచ్చి లింగన్నను అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు అతన్ని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి పోలీసులు వారెంట్‌ లేకుండా రావడంతో లింగన్న అరెస్ట్‌కు మెట్‌పల్లి జడ్జి అంగీకరించలేదు.

లింగన్నను తీసుకెళ్లిన కశ్మీర్ పోలీసులు

దీంతో జమ్మూ కోర్టు నుంచి వారెంట్‌ కాపీతో పోలీసులు మళ్లీ బుధవారం రాత్రి మెట్‌పల్లికి చేరుకుని లింగన్నను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌తో అతన్ని జమ్మూకు తీసుకెళ్లారు.

ఇదీ చదవండిఃకరోనా నుంచి కాపాడుకోండిలా..!

ABOUT THE AUTHOR

...view details