జగిత్యాలలో చిరుతపులి కలకలం రేపగా... పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇంట్లో దూరినట్లు ప్రత్యక్ష సాక్షులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న అటవీ అధికారులు... రెండు గంటలపాటు చిరుతకోసం గాలించారు. అయితే ఆచూకీ లభించకపోవడం వల్ల అడవిపిల్లిగా భావించి అధికారులు వెనుతిరిగారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చిరుత మళ్లీ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న పిల్లి తిరుపతి అనే వ్యక్తిపై దాడి చేయగా స్వల్పంగా గాయపడ్డాడు.