కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు తెరాస రాష్ట్ర నాయకులు డా.సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదల కోసం.. కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను ఆర్డీవో వినోద్‌తో కలిసి డా.సంజయ్ ప్రారంభించారు.
నిరుపేదల కోసం ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం - తెలంగాణ తాజా వార్తలు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిరుపేదల కోసం ఐసోలేషన్ సెంటర్‌ను తెరాస నేత డా. సంజయ్ ప్రారంభించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
corona help
అనంతరం నియోజకవర్గంలోని 89మంది లబ్ధిదారులకు 27 లక్షల యాభై ఏడువేల రూపాయలు విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మున్సిపల్ ఛైర్మన్ సుజాతతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని డా.సంజయ్ తెలిపారు.
- ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల