తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో పోచమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు - పెద్దఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు

జగిత్యాలలో పోచమ్మ తల్లి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

large number of devotees attended bonalu for pochamma temple in jagtial district
జగిత్యాలలో పోచమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Feb 14, 2021, 3:36 PM IST

జగిత్యాలలో పోచమ్మ తల్లికి చలి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ వాడ, పోచమ్మ వాడ, పురాణిపేట ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా ఆలయానికి రావడంతో పరిసరాలు సందడిగా మారాయి.

పోచమ్మ తల్లికి పూజలు నిర్వహించిన భక్తులు

అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా చలి బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి :భద్రాద్రిలో వైభవంగా రామదాసు జయంతి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details