జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. తన చేనులో పత్తి ఏరడానికి వెళ్లిన ఆమె అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వేతకగా ఉదయం వ్యవసాయ భూమిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. జిల్లా ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలిని పరిశీలించారు. భూ వివాదంతోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కొండాపూర్‌లో మహిళ దారుణ హత్య - jagityala crime news
పంట చేనుకు వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన జగిత్యాల జిల్లా కొండాపూర్‌లో జరిగింది. ఘటనా స్థలిని ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
కొండాపూర్‌లో మహిళ దారుణ హత్య