తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎంగారు ఫాంహౌస్ నుంచి బయటకు రండి.. రైతుల గోడు పట్టించుకోండి' - Jagityala District Latest News

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ సీఎం కేసీఆర్​పై తీరుపై విరుచుకుపడ్డారు. ఫాంహౌస్​ నుంచి బయటకు వచ్చి రైతుల బాధలు పట్టించుకోవాలని డిమాండ్​ చేశారు.

L Ramana fires on Telangana government in jagitial district
'సీఎంగారు ఫాంహౌస్ నుంచి బయటకు రండి.. రైతుల గోడు పట్టించుకోండి'

By

Published : Oct 27, 2020, 2:22 PM IST

రాష్ట్రంలో పంట నష్టపోయి ఈ మధ్యనే ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వారికి ప్రభుత్వం భరోసాని కల్పించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ అన్నారు. అన్ని పంటలను మద్దతు ధరకు కొనాలని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా.. కేసీఆర్ ఫాంహౌస్​ దాటకుండా రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

దుబ్బాకలో దొరికిన డబ్బుల వ్యవహారంలో ఈసీ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నగరం ముంపునకు గురైనా కనీసం సీఎం కేసీఆర్‌ పరామర్శించకపోవటం బాధకరమన్నారు.

ఇదీ చూడండి:నాయిని సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details