జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం హుండీ ఆదాయం లెక్కించారు. 64 రోజుల తర్వాత హుండీ ఆదాయాన్ని గణించినట్లు అధికారులు తెలిపారు. 65 లక్షల 59వేల 590 నగదు, 70 గ్రాముల బంగారం, అరకిలో వెండి, 98 విదేశీ కరెన్సీ నోట్లు స్వామివారి ఖజానాకు చేకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
కొండగట్టు అంజన్నకు 64 రోజుల్లో 65 లక్షల పైబడి ఆదాయం