తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Speech Jagtial Tour Today : 'జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేసే బాధ్యత నాది' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

KTR Speech Jagtial Tour Today : జగిత్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల కోసం నూకపల్లి శివారులో రూ.280 కోట్లతో నిర్మించిన 3,720 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి పేదలకు పంపిణీ చేశారు. కేటీఆర్ రాకతో జగిత్యాల జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు.

Minister KTR Visits Jagtial District
Minister KTR

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 1:44 PM IST

Updated : Oct 3, 2023, 3:08 PM IST

KTR Speech Jagtial Tour Today జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేసే బాధ్యత నాది

KTR Speech Jagtial Tour Today : "జగిత్యాల మామిడి రైతులకు మేలు చేసే బాధ్యత నాది.. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రైతులు ఎంతలా అభివృద్ధి చెందారో యావత్ దేశం చూస్తోంది. మీకు ఎలాంటి నష్టం జరగకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." అంటూ జగిత్యాల ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. జిల్లాలో పర్యటించిన మంత్రి జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

KTR Jagtial Tour Updates :జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి శివారులో రూ.280 కోట్లతో నిర్మించిన 3,720 రెండు పడక గదుల ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు. రూ.38 కోట్ల 40 లక్షలతో నిర్మించిన సమీకృత పోలీసు కార్యాలయ భవనాన్ని, నాలుగున్నర కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురిలో ఎనిమిదిన్న కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రం, పైలాన్‌ ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మంత్రి జగిత్యాల మినీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ రాకతో జగిత్యాల జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

KTR Fires on Congress :ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా.. ముఖ్యమంత్రి కేసీఆర్​తోనే ఇది సాధ్యమైందని అన్నాారు. జగిత్యాలకు వైద్యకళాశాల తెచ్చుకున్నామని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో సంజయ్‌ ఎన్నో సేవలు అందించారని మంత్రి కొనియాడారు. రైతులు నష్టపోకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ తయారు చేశామని చెప్పారు. ఒక్క రైతు నష్టపోకుండా జగిత్యాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ జిల్లా వాసులకు హామీ ఇచ్చారు.

KTR Comments on PM Modi : 'రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు'

'మామిడి మార్కెట్ ఉన్న జగిత్యాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొస్తాం. సాగు నీటి కోసం తాగునీటి కోసం ఊరికి ఊరికి మధ్య పంచాయతీలు పెట్టేవాళ్లు. రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాంత ఆయకట్టుకును సస్యశ్యామలం చేశారు. సమస్య పరిష్కరిద్దామంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కూడా ఇచ్చేవాళ్లు కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఒకసారి కాదు రెండుసార్లు ఏకంగా 50 ఏళ్లు అవకాశం ఇచ్చారు. వాళ్లు చేసింది మీకు తెలియంది కాదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఓట్లు దండుకున్న మోదీ ఉద్యోగాలు ఇచ్చారా ఒకసారి నిలదీయండి. హిందూ ముస్లిం గొడవలు మత పిచ్చి గొడవలు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదు.' -కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

KTR Promise To Jagtial Mango Farmers : జిల్లాలో మామిడి రైతులకు మేలు చేసే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటు వస్తుందా..? లేదా అని ప్రజలను అడిగారు. తేదీ, సమయం చెబితే.. కాంగ్రెస్‌ నేతలను తీసుకువచ్చి 24 గంటలు విద్యుత్ వస్తుందో లేదో చూపిస్తామని.. లేకపోతే ఒకసారి తీగలు పట్టుకుని చూడండి.. కరెంట్‌ వస్తుందో లేదో తెలుస్తుందని కాంగ్రెస్​ నేతలను ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు ఏమంటున్నారో రైతులు జాగ్రత్తగా వినాలని.. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్‌కు అండగా నిలబడాలని కోరారు. ఈ ఊరికి, ఆ ఊరికి గొడవలు పెట్టింది కాంగ్రెస్ నేతలు కాదా అని మంత్రి ప్రశ్నించారు. పదేళ్ల క్రితం పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండని కేటీఆర్ అన్నారు.

మరోవైపుజగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉండడంతో మెట్​పల్లి, కోరుట్ల డివిజన్లలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గత కొన్ని రోజుల నుంచి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ అంగన్​వాడి కార్యకర్తలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆశా వర్కర్లు ఎవరికి వారు వేదికలను ఏర్పాటు చేసుకొని సమ్మె చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో మెట్​పల్లి, కోరుట్లలో పోలీసులు రెండు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పలువురు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

KTR Tweet on PM Modi : 'మోదీ జీ.. మా 3 ప్రధాన హామీల సంగతేంటి?'

KTR Fires on Congress : 'వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ.. గ్యారెంటీలు ఇస్తుంది'

Last Updated : Oct 3, 2023, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details