ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పట్టణంలోని సూపర్ స్ప్రెడర్లను గుర్తించి మొదటి డోసు టీకాలను ఈరోజు వేయించారు.
వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు - korutla mla vidyasagar rao latest news
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పరిశీలించారు. ఎంత మందికి టీకాలు ఇచ్చారు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వైద్యాధికారులతో చర్చించారు.
వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
ప్రజలందరూ కరోనా మహమ్మారికి భయపడకుండా... వ్యాక్సిన్ వేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా