జగిత్యాలలో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. అయోధ్యలో నిర్మించే ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు' - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిర విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మించే ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
'రామమందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు'
ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉందని పేర్కొన్నారు. తామందరం రాముని భక్తులమేనని.. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులౌతామా అని ప్రశ్నించారు. గతంలో ఉన్న ఎంపీ కవిత ఎంతో గౌరవంగా మాట్లాడే వారని.. ఇప్పుడు భాజపా నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విద్యాసాగర్‌రావు దుయ్యబట్టారు.