జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ తన స్నేహితులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. కొవిడ్ బాధితులను తీసుకెళ్లేందుకు దీనిని ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇవాళ ప్రత్యేక పూజలు చేసి అంబులెన్స్ ప్రారంభించారు. బాధితులకు అండగా నిలవాలని డాక్టర్ సంజయ్ కోరారు. మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వైరస్ సోకకముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోకుండే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు.
ఆసుపత్రికి అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యే కుమారుడు - కోరుట్ల ఎమ్మెల్యే కుమారుడు అంబులెన్స్ ధానం
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి... కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ అంబులెన్స్ అందించారు. ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి అంబులెన్స్ ప్రారంభించారు.
![ఆసుపత్రికి అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యే కుమారుడు korutla mla vidyasagar aro son donate ambulance to jagitial hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8289703-781-8289703-1596533294860.jpg)
ఆసుపత్రికి అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యే కుమారుడు
ఇదీ చూడండి: వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్- భారత్ బయోటెక్