జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని తన స్వగృహంలో పూల కుండీలను శుభ్రం చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగార్ రావు. కుండీల్లో ఉన్న నీటిని పారబోసి కొత్త నీటిని నింపారు. ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించి దోమల నివారణ కోసం ప్రత్యేత జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే - ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే
దోమల నివారణ కోసం ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని పురపాలక మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పందించారు.
![ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే mla vidya sagar rao cleaned his house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7137754-792-7137754-1589094895374.jpg)
ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే
ప్రజల ఆరోగ్యం కోసం మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలిపారు. ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రమంతా ఆరోగ్యంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం