తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే పీఏ గల్లంతు... పోలీసుల వెతుకులాట! - kakatiya canal in jagtial

స్నేహితులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వలో ఈతకు వెళ్లిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు పీఏ గిరీశ్​ గల్లంతయ్యాడు.

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు పీఏ గల్లంతు

By

Published : Nov 3, 2019, 7:49 PM IST

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు పీఏ గల్లంతు

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు పీఏ ఎస్సారెస్పీ కాకతీయ కాల్వలో గల్లంతయ్యాడు. ధరూర్‌ క్యాంపులో అపార్టుమెంట్​లో ఉంటున్న గిరిశ్​ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. గిరీశ్​కు ఈత రాక నీటిలో కొట్టుకు పోయాడు.. స్నేహితులు కాపాడేందుకు యత్నించగా ఫలించలేదు. పోలీసులు రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించారు. గిరిష్‌ పంచాతీరాజ్‌శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ ఎమ్మెల్యే వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు.. గతంలో ఎమ్మెల్యే ఎల్‌.రమణ వద్ద కూడా పీఏగా పని చేశాడు.

ABOUT THE AUTHOR

...view details