తెలంగాణ

telangana

ETV Bharat / state

కోరుట్ల వ్యవసాయ సంచాలకులు అమీనాబీపై సస్పెన్షన్​ వేటు - కోరుట్ల వ్యవసాయ శాఖ సంచాలకు సస్పెండ్​

జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ సహాయ సంచాలకులు అమీనాబీని నిధుల దుర్వినియోగం ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ధర్మపురి వ్యవసాయ సంచాలకులు రామ్​చందర్​కు అదనపు బాధ్యతలు అప్పగింస్తున్నట్టు పేర్కొన్నారు.

Korutla agriculture Assistant Manager suspension
కోరుట్ల వ్యవసాయ సంచాలకులు అమీనాబీపై సస్పెన్షన్​ వేటు

By

Published : Nov 7, 2020, 2:19 PM IST

రైతులకు అందించే నీటి నిర్మాణానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ సహాయ సంచాలకులు అమీనాబీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు జిల్లా పాలనాధికారి రెవెన్యూ అధికారులతో అక్కడి పరిస్థితులను విచారణ జరిపించారు. రైతులకు అందాల్సిన నిధులు దారి తప్పించి అమీనాబీ తన బంధువుల ఖాతాల్లో బదిలీచేసినట్టు వెల్లడైంది. ఈ నివేదికను కలెక్టర్​ వ్యవసాయ కమిషనర్ జనార్ధన్ రెడ్డికి అందించగా.. ఆయన పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు ధర్మపురి వ్యవసాయ సంచాలకులు రామ్​చందర్​కు కోరుట్ల అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2017 నుంచి చేపట్టిన నీటి కుంటలు నిర్మాణాల్లో అమీనాబీ తన దగ్గరి బంధువులను గుత్తేదారుగా చూసి సుమారు 14 లక్షల వరకు ఖాతాలో జమ చేసి బిల్లులు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేకాకుండా నిర్మాణాల్లో నాణ్యతలేని పాలిథిన్ కవర్లు వాడినట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ శాఖ కమిషనర్ అమీనాబీని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ

ABOUT THE AUTHOR

...view details