జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం గత 45 రోజులుగా భక్తులు లేక వెలవెలబోతోంది. భక్తులు ఇచ్చే తినుబండారాల కోసం కొండగట్టు ఆలయం ప్రాంగణంలో సందడి చేసే కోతులు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి.
కోతుల ఆకలి తీర్చిన మంత్రి సతీమణి - Koppula Eshwar Wife Giving Fruits For Monkeys In Kondagattu
గత 45 రోజులుగా కొండగట్టు ఆలయానికి భక్తులు రాక.. తినడానికి తినుబండారాలు దొరకక ఆకలితో అలమటిస్తున్న కోతులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత పండ్లు అందించారు.
కోతుల ఆకలి తీర్చిన మంత్రి సతీమణి
లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న మూగజీవాల బాధ అర్థం చేసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర సతీమణి స్నేహలత, కూతురు నందిని కోతులకు అరటి పండ్లు అందించి ఆకలి తీర్చారు. కొప్పుల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందలాది మూగజీవాలకు పండ్లు అందించి ఆకలి తీరుస్తున్నట్టు మంత్రి సతీమణి కొప్పుల స్నేహలత తెలిపారు.