జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులు లేకుండానే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈనెల 17 వరకు ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
నేటి నుంచి కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు - జగిత్యాల జిల్లా కొండగట్టు తాజా వార్తలు
కొండగట్టు అంజన్న ఆలయంలో నేటి నుంచి భక్తులు లేకుండానే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. అందుకు గురువారం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులు, దీక్షాపరులకు కొండపైకి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.
![నేటి నుంచి కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు kondagattu pedda hanuman jayanti from today in jagtial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7206727-868-7206727-1589527221332.jpg)
నేటి నుంచి కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
మూడు రోజులపాటు హోమం జరగనుంది. లాక్డౌన్ కారణంగా ఆలయంలోకి భక్తులను అనుమతించకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రోక్తంగా ఆలయంలో కార్యక్రమాలు అన్నీ జరుగుతాయన్నారు. కేవలం అధికారులు, ఆలయ అర్చకులు మాత్రమే ఆలయంలో ఉత్సవాలు చేయనున్నారు.
ఇదీ చూడండి :అయినోళ్లకు దూరంగా.. ఆయువే భారంగా!