కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో... రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో వరుసగా రెండో ఏడాది కూడా భక్తులు ఎవరూ లేకుండానే వేడుకలు నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
Kondagattu: నిరాడంబరంగా కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా భక్తులను ఎవరిని అనుమతించకుండానే వేడుకలు జరిగాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామి వారికి అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్ఫించారు.
కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలు
లోక కల్యాణం కోసం యాగశాలలో హోమం నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలు ఈ రోజు ముగియనున్నాయి. ఆలయ ఈవో చంద్రశేఖర్‌తో పాటు, అర్చకులు మాత్రమే హాజరై పూజల్లో పాల్గొన్నారు. కొండపైకి భక్తులెవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.