Kondagattu Anjanna Utsavalu: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చిన్న జయంతి పేరుతో నిర్వహించే ఈ ఉత్సవాలు... మూడు రోజులపాటు(ఈనెల 16 వ తేదీ వరకు) కొనసాగుతాయి. ఉత్సవాలు ప్రారంభం కావటంతో ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి.. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో భారీ స్థాయిలో హనుమాన్ దీక్ష పరులు కొండపైకి చేరుకొని మాలవిరమణ చేయనున్నారు.
సుమారు 3 లక్షల మంది భక్తులు ఆలయానికి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బారికేడ్లు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు.