తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణం, పరిశుభ్రతపై విద్యార్థుల ప్రచారం - kodimyala junior college students at nss sibhiram

విద్యార్థి దశలోనే సామాజిక సేవా దృక్పథం అలవర్చుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో కొడిమ్యాల జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామాల్లో తిరుగుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

kodimyala junior college students at nss sibhiram
పర్యావరణం, పరిశుభ్రతపై విద్యార్థుల ప్రచారం

By

Published : Dec 28, 2019, 12:22 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల జూనియర్ కళాశాల విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. జాతీయ సేవా పథకం వాలంటీర్లుగా... రామకృష్ణాపూర్ గ్రామంలో ఏడు రోజుల శిబిరంలో పాల్గొన్నారు.

పర్యావరణం, పరిశుభ్రతపై విద్యార్థుల ప్రచారం
గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని విద్యార్థులు గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రచారం చేశారు. పాఠశాలతోపాటు నివాస ప్రాంతాల్లో చెత్తను తొలగించారు. విద్యార్థుల సేవా దృక్పథానికి గ్రామస్థులు సైతం చేయూతనిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details