ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజేశ్వరరావు తెరాస ఆవిర్భావం నుంచి చురుకుగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి రాజేశ్వరరావు అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ గుర్తు చేసుకున్నారు.
మెట్ పల్లిలో ఖాదీ బోర్డు ఛైర్మన్ సంతాప సభ - మెట్ పల్లిలో ఖాదీ బోర్డు ఛైర్మన్ సంతాప సభ
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజేశ్వరరావు సంతాప సభ నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావా వసంత పాల్గొన్నారు.
మెట్ పల్లిలో ఖాదీ బోర్డు ఛైర్మన్ సంతాప సభ
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజేశ్వరరావు సంతాప సభ నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
TAGGED:
metpalli news