తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా చెప్పేవన్ని అబద్ధాలే: కవిత - trs mp candidate

నిజమాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో ఉదయం నుంచి రోడ్​షోలు నిర్వహించారు. అబద్ధాలు చెప్పే వారిపై మొగ్గు చూపవద్దంటూ సూచించారు.

రోడ్డు షోలో పాల్గొన్న కవిత

By

Published : Mar 23, 2019, 1:09 PM IST

జగిత్యాల జిల్లా పెంబట్లలో తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత రోడ్​ షో నిర్వహించారు. జగిత్యాలలోని ప్రతి గ్రామంలో రెండు పడక గదులు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా కేంద్రంలో ఉండటంవల్లే నిజామాబాద్ నుంచి పెద్దపల్లి రైల్వేలైన్ సాధ్యమైందన్నారు. ఈసారి కూడా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల వేళ భాజపా అన్ని అబద్ధాలే చెబుతోందని కవిత ఆరోపించారు.

రోడ్డు షోలో పాల్గొన్న కవిత

ABOUT THE AUTHOR

...view details