జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇస్కాన్ మందిర నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్తీకదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు. స్వామివారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. హరే క్రిష్ణ మందిరం నిర్వాహకుడు నరహరి దాస్ భక్తులకు ప్రవచనాలు చేశారు.