కార్తిక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వెలగటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వదులుతున్నారు.
భక్తి పారవశ్యం: వెలుగులీనుతోన్న దేవాలయాలు - jagtial district news
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి, కోటి లింగాల ఆలయాలు కార్తిక దీపాలతో వెలుగులీనుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వరస్వామి, కోటేశ్వరస్వాములకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.
భక్తి పారవశ్యం: వెలుగులీనుతోన్న దేవాలయాలు
లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వరస్వామి, కోటేశ్వరస్వామి ఆలయ ఆవరణల్లో భక్తి, శ్రద్ధలతో మహిళలు కార్తిక దీపాలను వెలిగిస్తున్నారు.
ఇదీ చదవండి:గ్రేటర్‌లో బ్యాలెట్ విధానం... ఆలస్యం కానున్న లెక్కింపు ప్రక్రియ