నేర పరిశోధనలో పోలీసులు పరస్పర సహకారంతో వ్యవహరించాలని కరీంనగర్ సీపీ, జగిత్యాల ఇన్ఛార్జ్ ఎస్పీ కమలాసన్ రెడ్డి పోలీసులకు సూచించారు. జిల్లాలోని పోలీసులతో వీకేబీ గార్డెన్లో సమావేశమయ్యారు. నేర పరిశోధనలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులను అందజేశారు.
నేర పరిశోధనలో పరస్పరం సహకరించుకోవాలి: సీపీ కమలాసన్ రెడ్డి - జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ కమలాసన్ రెడ్డి
జగిత్యాల పోలీసులతో కరీంనగర్ సీపీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ కమలాసన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర పరిశోధనలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డులను అందజేశారు.

నేర పరిశోధనలో పరస్పరం సహరించుకోవాలి: సీపీ కమలాసన్ రెడ్డి
అన్ని విభాగాలకు చెందిన పోలీసులు అంకితభావంతో పని చేస్తేనే కేసుల పరిశోధన సాధ్యమవుతుందన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పోలీసులు మరింత పకడ్బందీగా కృషి చేస్తే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సీపీ తెలిపారు.