తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ప్రభుత్వం అందరికి అండగా ఉంటుంది: విద్యాసాగర్​రావు - Jagityala District Latest News

జగిత్యాల జిల్లాలోని మెట్​పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు చెక్కులు పంపిణీ చేశారు. అన్ని వర్గాలను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం వివిధ పథకాలు అందిస్తోందన్నారు.

Kalyana Lakshmi checks were distributed by MLA Vidyasagar Rao
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు

By

Published : Mar 6, 2021, 9:28 PM IST

రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు వివిధ పథకాలు అందిస్తూ తెరాస ప్రభుత్వం అందరికీ అండగా ఉంటోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

66 మంది లబ్ధిదారులకు రూ.66 లక్షల విలువ గల చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తెరాస నాయకులు సాయిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేశ్, కిషోర్, డా.నాగభూషణం, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఉత్తమ స్వయం సహాయక సంఘాలకు జాతీయ అవార్డులు

ABOUT THE AUTHOR

...view details