జగిత్యాల జిల్లా పరిషత్ ఎన్నిక ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా దావ వసంతను, వైస్ ఛైర్మన్‌గా వొద్దినేని హరిచరణ్‌రావును ఎన్నుకున్నారు.. జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 17 స్థానాలు తెరాస గెల్చుకుంది. ఏక పక్షంగా పరోక్ష పద్దతిలో జరిగిన ఎన్నికల్లో తెరాసకు పీఠం దక్కింది.. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ హాజరై గెలుపొందిన సభ్యులను అభినందించారు. ఎన్నిక ముగిసిన తర్వాత జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గెలుపు పత్రాలను వారికి అందజేశారు.
జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌గా దావ వసంత - jagtial-zp chairman
జగిత్యాల జడ్పీ పీఠాన్ని తెరాస దక్కించుకుంది. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా దావ వసంత, వైస్ ఛైర్మన్‌గా వొద్దినేని హరిచరణ్‌రావును ఎన్నుకున్నారు.

జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌గా దావ వసంత
TAGGED:
jagtial-zp chairman