జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్లలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజామున రెండు డిపోల వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా తెరాస నాయకులు అడ్డుకున్నారు. వర్తక, వాణిజ్య వ్యాపారులు బంద్కు సహకరించాలని తెరాస నాయకులు కోరారు.
జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా బంద్.. కూడళ్ల వద్ద బందోబస్త్ - jagtial district trs leaders support to bharat bandh
కేంద్రం ప్రవేశపెట్టిన రైతు చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలు మద్దతునిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా బంద్
బంద్ వల్ల రహదారులన్ని నిర్మానుష్యంగా కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. కర్షకులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి తెరాస మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.