Jagtial government school Teacher Innovations: జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన సుమతి ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. 2012లో పాఠశాలలో విధుల్లో చేరిన ఈ ఉపాధ్యాయురాలు గణితంలో విద్యార్థులు పడే ఇబ్బందులు తెలుసుకుని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. సులభ పద్ధతులలో గణితం ఈజీగా అర్థం అయ్యే విధంగా విద్యార్థులకు ప్రయోగకరంగా పాఠాలు భోదిస్తుంది. తరగతి గదిలో విద్యార్థి చేతుల్లో పుస్తకాలతో వారికి పాఠాలు బోధిస్తుంటారు కానీ ఇక్కడ చూడండి ప్రతి విద్యార్థి చేతులు పుస్తకానికి బదులు ఓ పరికరం ఉంది. ఇలాంటి పరికరాలతోనే గణిత శాస్త్రంలో ఉండే మెలకువలు క్షణాల్లో అర్థం అయ్యేలా విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంది. కేవలం విద్యాబోధనే కాకుండా పలు రకాల ఇన్నోవేషన్లను తయారు చేసి ప్రదర్శనలు ఇచ్చి వివిధ చోట్ల అవార్డులు ప్రశంస పత్రాలు తన సొంతం చేసుకొని ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది.
టీచర్ కోసం ఏడ్చిన విద్యార్థులు.. పాఠశాలకు తాళం.. 'అప్పుడే స్కూల్ తెరుస్తాం' అంటూ..
పండించిన ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు పడే ఇబ్బందులు తెలుసుకున్న ఉపాధ్యాయురాలు సుమతి రైతుల కోసం ప్రత్యేకంగా క్రాప్ ప్రొటెక్టింగ్ అంబ్రెల్లా (ధాన్యము రక్షణ కవచం) ఇన్నోవేషన్ తయారు చేసింది. దీన్ని ఇంటింటా కార్యక్రమంలో ప్రదర్శించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్చే భేష్ అనిపించుకుంది. మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు ప్రత్యేక అవార్డును అందుకుని, రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఎంపికైంది.
TEACHING IN TAMIL COLONY: ఆ ఊళ్లో గోడలే బ్లాక్ బోర్డులు.. వీధులే పాఠశాలలు.!
'' గోధుర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఇక్కడకు వచ్చినపుడు పిల్లలు గణితంలో చాలా వీక్ గా ఉండటంతో బోర్డు మీద చేస్తేనే సరిపోదని చిన్న చిన్న టీఎల్ఎమ్ ద్వారా వాళ్లకు అర్ధం అయ్యేలా పాఠాలు చెప్పాను. టీఎల్‌ఎం ద్వారా పిల్లలు సులువుగా అర్ధం చేసుకుంటున్నారు. జవహర్ నవోదయలో దీన్ని ప్రదర్శించడం జరిగింది. డిస్ట్రిక్, స్టేట్ లెవల్లో ఫస్ట్ వచ్చాము. వ్యవసాయంలో పండించిన ధాన్యం తడవకుండా రైతులు పడే ఇబ్బందులు తెలుసుకున్న నేను పిల్లలకు చెప్పే 2డి 3డి డయాగ్రామ్స్ ద్వారా క్రాప్ ప్రొటెక్టింగ్ అంబ్రెల్లా (ధాన్యము రక్షణ కవచం) ఇన్నోవేషన్ తయారుచేశాను. ఇంటింటి ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఎంపికైంది.''-సుమతి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు