తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం పడిగాపులు.. గంటల్లోనే కొరత! - జగిత్యాల లేటెస్ట్ అప్డేట్స్

జగిత్యాల జిల్లాలో కొవాగ్జిన్ రెండో డోసు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో టీకా కేంద్రాలకు జనాలు పోటెత్తారు. వ్యాక్సిన్ కోసం ఉదయం నుంచే బారులు తీరారు. కాగా కొన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.

jagtial  second dose vaccination, vaccination
జగిత్యాలలో టీకా పంపిణీ, వ్యాక్సినేషన్

By

Published : May 25, 2021, 3:15 PM IST

జగిత్యాల జిల్లాలో కొవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీకా కోసం జనం అధిక సంఖ్యలో తరలి వచ్చారు. జిల్లాకు 4వేల డోసులు రాగా జగిత్యాల, ఖిలాగడ్డ, కోరుట్ల, కల్లెడ, మల్యాల, పెగడపల్లి, సారంగాపూర్‌, ధర్మపురి, గొల్లపల్లి, రాయికల్‌, మేడిపల్లి, కథలాపూర్‌, జగ్గాసాగర్‌, ఐలాపూర్‌, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, మెట్‌పల్లి, వెల్గటూర్‌ కేంద్రాల్లో టీకా ఇచ్చారు.

ఖిలాగడ్డ టీకా కేంద్రానికి వచ్చిన అందరికీ టీకా లభించలేదు. ఉదయం నుంచి ఎదురు చూస్తే వ్యాక్సిన్ లేదంటున్నారని ఆందోళన చేపట్టారు. జిల్లాకు 4వేల డోసులు మాత్రమే వచ్చాయని... బుధవారం వ్యాక్సినేషన్ ఉంటుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌ తెలిపారు.

ఇదీ చదవండి:ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ

ABOUT THE AUTHOR

...view details