తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లా ఆర్టీసీకి 18 రూ. కోట్ల నష్టం - lock down effect on telangana rtc

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ సంస్థ నష్టాల బారిన పడింది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో జిల్లా ఆర్టీసీ గణనీయమైన స్థాయిలో ఆదాయం కోల్పోయింది. వేతనాలు, నెలవారీ ఖర్చులు, హైర్‌ బస్సుల అద్దె మరింత భారంగా మారనున్నాయి. జగిత్యాల జిల్లా ఆర్టీసీ పరిస్థితులపై ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం

jagtial rtc lost eighteen crores due to lock down in corona crisis
జగిత్యాల జిల్లా ఆర్టీసీకి 18 రూ. కోట్ల నష్టం

By

Published : May 15, 2020, 10:06 AM IST

జగిత్యాల జిల్లా ఆర్టీసీలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మూడు డిపోలుండగా, జనతా కర్ఫ్యూ ముందు రోజు వరకు 268 బస్సులు నడిచాయి. జగిత్యాల డిపో 137 బస్సుల్లో ఆర్టీసీ 65, హైర్‌ బస్సులు 72, కోరుట్ల డిపో బస్సులు 68 వీటిలో ఆర్టీసీ 41, అద్దె బస్సులు 27, మెట్‌పల్లి డిపో బస్సులు 63, వీటిలో ఆర్టీసీ 40, హైర్‌ బస్సులు 23 నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయగా, లాక్‌డౌన్‌ తో ఇవన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

తిరిగే దూరం ఎంతంటే!

జిల్లాలో అత్యధిక బస్సులు ఉన్న జగిత్యాల డిపో పల్లె వెలుగు బస్సులు రోజుకు 380 కిమీ, ఎక్స్‌ప్రెస్‌లు 490 కి.మీ, రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులు రోజుకు 500 కి.మీ చొప్పున మొత్తం 58 వేల కి.మీ నడవగా, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల బస్సులు 26 వేలు, 24 వేల చొప్పున రోజుకు మరో 50 వేల క.ిమీ వరకు తిరిగాయి.

ఆదాయం.. రోజుకు రూ. 33 లక్షలు

జిల్లాలోని మూడు డిపోల్లోని మొత్తం 268 బస్సులు కలిపి ప్రతి నిత్యం సుమారు 20 వేల కి.మీ వరకు తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుండగా, ఇందుకుగాను రోజుకు రూ.33 లక్షల ఆదాయం సమకూరుతుంది. జగిత్యాల డిపో రోజుకు రూ.18 లక్షల ఆదాయం సాధించగా, కోరుట్ల డిపో రూ. 8 లక్షలు, మెట్‌పల్లి డిపో మరో రూ. 7 లక్షల ఆదాయం సమకూర్చుకునేవి.

ఉద్యోగులు 1056... వేతనాలు రూ. 3.30 కోట్లు

మూడు డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ సిబ్బంది కలిపి 1056 మంది, మరికొందరు అధికారులు, ఉద్యోగులు సేవలను అందిస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.3.30 కోట్ల మేరకు వేతనాలు అందుతున్నాయి. జగిత్యాల డిపోలో 249 మంది కండక్టర్లు, 198 మంది డైవర్లు, మెకానికల్‌ ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు కలిపి మొత్తం 521 మంది విధులు నిర్వర్తిస్తుండగా, అధికారులతో పాటు వీరికి కలిపి రూ. 1.50 కోట్ల వేతనాలు, కోరుట్ల డిపోలో 281తో పాటు ఇతరులు కలిపి రూ. 98 లక్షలు, మెట్‌పల్లిలో 254 మందితో పాటు ఇతరులకు కలిపి రూ. 82 లక్షల వేతనాలు ఆర్టీసీ సంస్థ చెల్లిస్తోంది.

జగిత్యాల డిపో ఆదాయం రోజుకు సగటున రూ. 18 లక్షల ఆదాయం సాధించగా, ఇందులో వేతనాలు, ప్రయివేటు బస్సులకు అద్దె, టైర్లు, ఆయిల్‌, పన్నులు, ఇతర ఖర్చులు పోనూ రోజుకు రూ. 1.50 లక్షల లాభం వచ్చేంది. ఇదేతీరులో కోరుట్ల డిపో రోజుకు సాధించే రూ.8 లక్షల ఆదాయంలో రూ. 20 వేల వరకు లాభం ఆర్జించగా, మెట్‌పల్లి డిపో మాత్రం వివిధ స్థానిక పరిస్థితుల కారణంగా రోజుకు రూ. 20 వేల చొప్పున నష్టంలో ఉంది. గణనీయంగా సాధించిన ఆదాయం నుంచే అన్నీ ఖర్చులు చెల్లించినప్పటికీ జగిత్యాల, కోరుట్ల డిపోలు లాభాల బాటలో ఉన్నాయి.

మార్చి 22న జనతా కర్ఫ్యూ , మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ మొదలవడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయి 55 రోజులైంది. ఆర్టీసీ బస్సులు నడిచిన సమయంలో రోజుకు రూ. 33 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ. 18 కోట్ల ఆదాయం కోల్పోయింది. దీనికి తోడు జగిత్యాల, కోరుట్ల డిపోల ద్వారా రావాల్సిన లాభం రోజుకు రూ. 1.70 లక్షల చొప్పున మరో రూ. 94 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లయింది.

జిల్లా ఆర్టీసీ మొత్తంగా రోజుకు రూ. 11 లక్షల చొప్పున రూ. 6 కోట్ల వరకు వేతనాలు చెల్లించడం తప్పనిసరి. ఇతర నిర్వహణ ఖర్చులు, పన్నులు తదితరాలు కలిపి అదనంగా మరో రూ. ఒక కోటి వరకు సంస్థ చెల్లించాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు హైర్‌ బస్సుల అద్దె జిల్లా ఆర్టీసీ సంస్థపై మరి కొంత భారంగా మారే అవకాశం ఉంది.

ఇంధనం ఖర్చు రోజుకు రూ. 10 లక్షలు

జిల్లాలో మూడు డిపోల్లోని అన్నీ బస్సులు కలిపి రోజుకు సగటున 20 వేల కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా, ఇంధనం కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చవుతోంది. జగిత్యాల డిపో బస్సులు ప్రతి రోజు 8 వేల కి.మీ వరకు నవడగా, డీజిల్‌ కోసం రూ. 5.50 లక్షల వరకు, కోరుట్ల డిపో బస్సులు 6 వేల కి.మీ వరకు నడవగా, ఇందు కోసం ఇంధనానికి సగటున 3 లక్షలు, మెట్‌పల్లి డిపో బస్సులు 5 వేల కి.మీ వరకు, ఇంధనానికి రూ. 2 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details