ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జగిత్యాల జిల్లా పోలీసులు కఠినంగా అమలుపరుస్తున్నారు. మెట్పల్లిలో ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ప్రజలను నిత్యావసరాల కోసం అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా నిఘా రెట్టింపు చేశారు.
ద్విచక్ర వాహనాదారులపై ప్రత్యేక దృష్టి.. నిఘా పెంపు - case on two wheeler
జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. నిత్యవసరాల కోసం ఉదయం 10 గంటల వరకే పోలీసులు అనుమతించారు. ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ద్విచక్ర వాహనాదారులపై ప్రత్యేక దృష్టి.. నిఘా పెంపు
అనవసరంగా బయటకు వచ్చినా.. ఇద్దరిద్దరు చొప్పున వెళ్లినా కేసులు నమోదు చేస్తున్నారు. పలుచోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్తుడంగా.. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇవీ చూడండి:'ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నూతన విధానాలు కావాలి'