జగిత్యాల జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఐదు పట్టణాలు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ పురపాలికల ఓట్ల పెట్టెలు జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచారు.
ఓట్ల లెక్కింపు కోసం పట్టణాల వారీగా వేర్వేరు గదుల్లో టేబుళ్లు ఏర్పాట్లు చేసి అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఓట్లు లెక్కించేందుకు 260 టేబుళ్లు ఏర్పాటు చేసి 314 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు.