MLA Sanjay Kumar tested corona positive: తెరాసలో కరోనా కలకలం రేపుతోంది. వరుసగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్‌లకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వరుసగా అందరూ కరోనా బారిన పడుతుండటంతో.. తెరాస నేతల్లో ఆందోళన మొదలైంది.
తెరాసలో కరోనా కలకలం.. మరో ఎమ్మెల్యేకు పాజిటివ్ - MLA Sanjay Kumar tested corona positive
13:39 January 20
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్
నిన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులకు కరోనా సోకింది. మొన్న రాత్రి జ్వరం రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ జ్యోతి.. కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీనిలో ఇద్దరికీ కరోనా సోకినట్లు ఫలితాలు వచ్చాయి.
మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటే గండ్ర హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్‌గా తేలింది. జ్యోతి సీసీ ప్రదీప్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మిగిలిన పీ.ఏ లు, సెక్యూరిటీలు కొవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ప్రజలు క్షేమంగా ఉండాలని.. మాస్క్ ధరించాలని గండ్ర దంపతులు సూచించారు. హైదరాబాద్‌లో వెంకటరమణ రెడ్డి, హన్మకొండలోని నివాసంలో జ్యోతి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మంత్రుల పర్యటనలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఇంకా ఎవరెవరికి కరోనా సోకింది అనే విషయం తెలియాల్సి ఉంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!